హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడాలి నానిపై రావి ఫైర్: బాలయ్యతో కల్సి బాబు ఇంటికి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodali Nani
హైదరాబాద్: గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తన స్వార్థం కోసం నందమూరి తారక రామారావు కుటుంబాన్ని చీల్చే ప్రయత్నాలు చేశారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సోమవారం అన్నారు. ఆయన ఉదయం హీరో, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణను ఆయన ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థం కోసం ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టే యత్నం చేసిన నానికి గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

నియోజకవర్గంలో పార్టీ బలంగానే ఉందని ఆయన అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తానని, ఎలా చేయాలో తనకు తెలుసునని చెప్పారు. కాగా రావి హీరో బాలయ్య ఇంట్లో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం బాలకృష్ణ రావిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకు వెళ్లారు. ముగ్గురు బాబు ఇంట్లో భేటీ అయ్యారు.

కాగా కృష్ణా జిల్లా గుడివాడ మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వర రావు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే. రావి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి టిడిపి అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. రావి అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేత. కానీ జూనియర్ ఎన్టీఆర్ బలవంతం మీద అప్పుడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2009లో రెండోసారి కొడాలి నానికి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు.

అప్పుడే కొత్తగా మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించడంతో రావి టిడిపిని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అయితే తాజాగా కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుడివాడలో మంచి పట్టున్న రావి తిరిగి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రావి చేరిక వెనుక బాలకృష్ణ ప్రయత్నాలు ఉన్నాయని సమాచారం.

అందుకే హీరో నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తంలోనే రావి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం రావి తన అనుచరులతో పార్టీలో చేరనున్నారు. రావి వెంకటేశ్వర రావు తండ్రి రావి శోభనాద్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. దీంతో అక్కడ వారికి మంచి పట్టు ఉంది. దీంతో రావి గుడివాడ ఎమ్మెల్యేగా 2004 వరకు కొనసాగారు.

అయితే ఆ తర్వాత గుడివాడ టిక్కెట్ కొడాలి నానికి ఇవ్వడంతో ఆయన 2009కి ముందు పిఆర్పీలో చేరారు. ఇప్పుడు రావి తిరిగి పార్టీలో చేరడంతో రానున్న ఎన్నికల్లో గుడివాడ నుండి కొడాలి నాని పైన రావి పోటీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కొడాలి నాని జగన్‌కు జై కొట్టడంతో ఉప ఎన్నికల్లోగానీ, 2014 ఎన్నికల్లో గానీ గుడివాడ నుండి టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థి గురించి జోరుగా చర్చ జరిగింది. ఓ సమయంలో బాలకృష్ణనే స్వయంగా పోటీ చేస్తారనే వాదనలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య ఆశీర్వాదంతో పార్టీలోకి వచ్చిన రావియే నానిపై పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Gudivada former MLA Raavi Venkateswara Rao lashed out at MLA Kodali Nani for joining in YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X