వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌లో పేలుళ్లు, 73మంది హతం: ఉపాధ్యక్షుడికి ఉరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Iraq Map
బాగ్దాద్: ఇరాక్‌ ఆదివారం మళ్లీ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో సుమారు 73 మంది వరకు మృతి చెందినట్లు అల్‌జజీరా పేర్కొంది. దేశంలోని పదకొండు నగరాలలో ఆదివారం పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 213 మంది గాయపడ్డారు. నస్సీరియాలోని ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం సహా 11 నగరాలలో దాదాపు ఇరవై ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయి. సైన్యం, వాణిజ్య మార్కెట్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు.

మృతి చెందిన వారిలో పలువురు సైనికులు కూడా ఉన్నారు. ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం వద్ద కారు బాంబు దాడిలో గార్డు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. అమర పట్టణంలో దాడులు, కాల్పుల్లో 16 మంది మృతి చెందగా చాలామంది గాయపడ్డారు. దుజైల్‌లో శనివారం అర్ధరాత్రి సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 10 మంది సైనికులు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

ఆదివారం కిర్‌కుక్‌లోని చమురు సంస్థ వద్ద కారు బాంబు దాడిలో పలువురు మృతి చెందారు. కిర్‌కుర్‌లో కారు, మోటారు, సైకిల్ బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, నలభై మందికి పైగా గాయపడ్డారు. సమర్రా, బస్రా తదితర నగరాలలో చేసిన దాడులలోనూ పలువురు మృతి చెందారు. ఇరాక్‌లోని అలై ఖైదా అనుబంధ సంస్థ ఈ దాడులకు పాల్పడింది.

ఇరాక్ ఉపాధ్యక్షుడికి ఉరి శిక్ష

కాగా పరారీలో ఉన్న ఇరాక్ ఉపాధ్యక్షుడు తారీక్ అల్ హషేమికి ఉరిశిక్ష విధిస్తూ బాగ్దాద్‌లోని ఓ న్యాయస్థానం ఆదివారం తీర్పు చెప్పింది. ఇదే సమయంలో తారీక్ కార్యదర్శి, అతని అల్లుడు అహ్మద్ ఖతన్‌కు కూడా బాగ్దాద్‌లోని మరో కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక లాయర్, మరో బ్రిగేడియర్ జనరల్ హత్య కేసులో హషేమీపై విచారణ సాగుతోంది. ఈ ఆరోపణల నేపథ్యం లో ఈ ఏడాది ఆరంభంలో ఆయన విదేశాలకు పారిపోయారు.

English summary
At least 73 people killed and more than 200 injured in attacks against iraqi security forces across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X