షిండేపై కోదండరామ్ రుసరుసలు, నిరసన లేఖ

తెలంగాణలో నక్సలైట్లు ఉన్నారా, ఆంధ్రలో నక్సలైట్లు ఉన్నారా అనేది షిండే తేల్చాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. రేపు గురువారం సకల జనుల సమ్మె పునరంకిత దీక్షలు చేపట్టాలని తెలంగాణ జెఎసి తెలంగాణ ఉద్యోగులకు పిలుపునిచ్చింది. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఉద్యోగుల పునరంకిత దీక్ష ఉంటుందని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ మార్చ్‌లో అధికార, ప్రతిపక్షాల నాయకులు పాల్గొనాలని సూచించారు.
ఈ నెల 17వ తేదీన తెలంగాణవ్యాప్తంగా తెలంగాణ విద్యార్థుల ఆత్మగౌరవ యాత్రలు చేపట్టాలని ఒయు జెఎసి, తెలంగాణ జెఎసి నిర్ణయించాయి. అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును అడ్డుకుంటామని ఆ సంఘాలు హెచ్చరిచాయి. తెలంగాణ మార్చ్ పోస్టర్‌ను తెలంగాణ జెఎసి బుధవారం ఆవిష్కరించింది.
విశాలాంధ్ర నినాదంతో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదని ఆయన అన్నారు. గాంధీజీ దండియాత్ర లాగా తమ తెలంగాణ మార్చ్ ఉంటుందని కోదండరామ్ చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ యాత్రను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాము ప్రశాంతంగా మార్చ్ సాగిస్తామని ఆయన అన్నారు. అయితే, జగరానిది ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో బిజెపి నాయకులు సమావేశమయ్యారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే తాము జాతీయ పతాకలను ఆవిష్కరిస్తామని బిజెపి నాయకులు ఇప్పటికే చెప్పారు.