బాబుపై ఉప్పులేటి ఫైర్: పొత్తులేదు.. విజయ చందర్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దెబ్బకు కాంగ్రెసు, టిడిపిల కార్యాలయాలు మూతవేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టిడిపి మాజీ నేత ఉప్పులేటి కల్పన వేరుగా అన్నారు. పామర్రులో మాట్లాడిన ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పార్టీ పైన కాంగ్రెసు, టిడిపిల విమర్శలకు అర్థం లేదన్నారు. కాంగ్రెసు నుండి టిడిపిలోకి వెళ్లిన చంద్రబాబు పార్టీ మారే నేతల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు ఆకర్షితురాలినైనా తాను జగన్ నాయకత్వంపై నమ్మకంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పామర్రులో సాయంత్రం జరిగే పార్టీ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారని, వారి సమక్షంలోనే జగన్ పార్టీలో చేరుతున్నట్లు మరో నేత నాగేశ్వర రావు చెప్పారు. వైయస్సార్సీ ప్రభంజనం ధాటికి ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications