వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా చిచ్చు: లిబియాలో అమెరికా కాన్సులేట్‌పై దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Libya
లిబియా/కైరో: లిబియాలోని బెంఘాజీ నగరంలో అమెరికా కాన్సులేట్ పైన జరిగిన దాడిలో ఓ అమెరికన్ ఉద్యోగి మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం పలువురు నిరసనకారులు అమెరికా కాన్సులేట్ పైన దాడికి దిగారు. నిరసనకారులు భవనాన్ని చుట్టుముట్టి దానిపై గ్రనేడ్లు విసిరారు.

ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి యుఎస్ స్టేట్ డిపార్టుమెంట్ అధికారి. అధికారి మృతిని అమెరికా స్టేట్ సెక్రటరీ హిల్లరీ రోథం క్లింటన్ ధృవీకరించారు. ఈ దాడి ఘటనను హిల్లరీ తీవ్రంగా ఖండించారు. విషయం తెలియగానే స్పందించిన హిల్లరీ లిబియా అధ్యక్షుడు మహమ్మద్ మెగారిఫ్‌కు ఫోన్ చేసి.. లిబియాలో ఉన్న అమెరికాలకు అదనపు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.

నిరసనకారులు తమ నిరసనలను ఇతర దేశాలకు కూడా వ్యాపింప చేసే అవకాశాలు ఉండవచ్చునని హిల్లరీ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న అమెరికన్లను, అమెరికన్ సముదాయాలను రక్షించాలని ఆయా దేశాలను హిల్లరీ కోరారు.

అరబ్ దేశాల్లో ఓ అమెరికా సినిమానే ఈ చిచ్చుకు కారణమని తెలుస్తోంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా అమెరికా సినిమా ఉందంటూ తొలుత ఈజిప్ట్ దేశంలో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ఇది తాజాగా లిబియాను పాకింది. బెంఘాజీలో అమెరికన్ రాయబార కార్యాలయంపై దాడి చేసిన నిరసనకారులు అమెరికా సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగినట్లుగా తెలుస్తోంది.

నిరసనకారులు కార్యాలయం ఎడమ వైపుకు నిప్పు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు బెంఘాజీ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారి వానిష్ అల్ షరీఫ్ మాట్లాడుతూ... నిరసనకారులు కాల్పులు జరిపిన అనంతరం కాన్సులేట్ పైన దాడి చేశారని, ఆ సమయంలో కాన్సులేట్‌లో ఎవరూ లేరని చెప్పారు.

English summary
An American official was killed and another injured on Wednesday when protesters attacked the US consulate in Libyan city of Benghazi, setting it ablaze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X