తెలంగాణ: కాంగ్రెసు అధిష్టానంపై కెకె తిరుగుబాటు

తెలంగాణ జెఎసి ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఏ జెండా పట్టినా అందరినీ స్వాగతిస్తామని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు తెలంగాణ మార్చ్‌లో పాల్గొనాలని ఆయన అన్నారు.
తెలంగాణపై నాన్చుడు ధోరణి సరి కాదని, తెలంగాణ ఇస్తారో లేదో చెప్పాలని బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. గవర్నర్ నరసింహన్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ఆయన విమర్శించారు సత్యాగ్రహ రీతిలో తెలంగాణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కోదండరామ్ అన్నారు.
కులమతాల పేరుతో తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం ఎవరి పరిధిలో వారు ఉద్యమించాల్సిందేనని ఆయన అన్నారు. ఇదిలా వుంటే, సకల జనుల సమ్మె చేపట్టి ఏడాది అవుతున్న సందర్బంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు గురువారం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద పునరంకిత దీక్షను చేపట్టాయి. ఇందులో స్వామిగౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications