మనసు మార్చుకున్న రాయపాటి, పోటీకి రెడీ

Rayapati Sambasiva Rao
గుంటూరు: కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తన మనసు మార్చుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆ మధ్య ఆయన తీవ్ర నిర్వేదంతో చెప్పారు. కానీ రాజకీయాల్లో కొనసాగడానికే ఆయన సిద్ధపడ్డారు. 2014లో వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగానే పోటీ చేస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొసాగుతానని ఆయన చెప్పారు.

కాంగ్రెసు పార్టీని వీడి తాను ఎటు వెళ్లబోనని ఆయన చెప్పారు. తన పదవిపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, తనకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రభావితం చేశారనే ఆరోపణలను ఆయన ఖండించారు. షిండేను సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రభావితం చేయలేదని ఆయన చెప్పారు.

తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వెల్లడించామని, తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలియజేశామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల్లో రాయపాటి సాంబశివ రావు కూడా ముఖ్యులు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ పదవి దక్కకపోవడంతో రాయపాటి సాంబశివ రావు తీవ్ర నిరాశకు గురైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పదవి రాకపోవడంతో ఆయన అసంతృప్తికి గురై పార్టీ నుంచి తప్పుకోవాలని కూడా ఆలోచన చేసినట్లు చెబుతారు. కానీ, ఆయన ప్రస్తుతం కాంగ్రెసులో కొనసాగాలని, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మాటల ద్వారా తెలిసిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+