డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్ సిలిండర్లపై పరిమితి

డీజిల్ ధరను లీటరుకు 5 రూపాయలు పెంచారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కింది కిరోసిన్, పెట్రోల్ ధరలను మార్చలేదు. సబ్సిడీ కింద సరఫరా చేసే వంటగ్యాస్ సిలిండర్లను ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఆరు మాత్రమే ఇస్తారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ కంపెనీలకు ప్రతి రోజు రూ. 550 కోట్ల నష్టం వాటిల్లుతోంది. డీజిల్ అమ్మకంపై లీటరుకు 19 రూపాయల నష్టం వస్తుండగా, కిరోసిన్‌పై లీటరుకు రూ.32.7, సిలిండర్‌కు రూ.347 రూపాయల చొప్పున ప్రతి రోజూ నష్టం వస్తోంది.
కాగా, డీజిల్ ధర పెంపుపై ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా మిత్రపక్షాలు కూడా భగ్గుమన్నాయి. సామాన్యుడిపై మోయలేని భారం పడుతుందని అన్నాయి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. డీజిల్ ధర పెంపును యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు తీవ్రంగా వ్యతిరేకించింది. తాము డీజిల్ ధర పెంపును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు.
డీజిల్ ధర పెంపును క్రూరమైన జోక్‌గా బిజెపి అభివర్ణించింది. సామాన్యుడిపై ఇది చావు దెబ్బ అని వ్యాఖ్యానించింది. పెట్రోల్ మాఫియాతో ప్రభుత్వం కుమ్మక్కయిందని బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. డీజిల్ ధర పెంపును ప్రజా వ్యతిరేక చర్యగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు.
-
భయపెడుతున్న క్రూడాయిల్- పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications