వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తున్నాం: ముఖ్యమంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో ఆయన శనివారంనాడు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని ప్రారంభించారు.

యాభై ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరుగుతోందని, తెలంగాణ ఉద్యమాన్ని తాము గౌరవిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైందని ఆయన అన్నారు. ఈ అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, ఆందోళనలు చేయవద్దని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం అయ్యే దాకా అభివృద్ధి వద్దా అని ఆయన అడిగారు.

చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ఆయన అన్నారు. గద్వాల రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. చేనేత వృత్తి ఎలా కొనసాగించాలో ఎవరైనా సూచనలు చేయవచ్చునని, వృత్తిలో సమస్యలను అధిగమించడానికి ప్రిత ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.

అప్పులకు భయపడి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. అప్పులు వ్యక్తిగతంగా తమకు కూడా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా అప్పులున్నాయని ఆయన అన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said that they are honoring Telangana sentiment and Union government will take a decision on Telangana issue soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X