యాత్రపై బాబు కసరత్తు: ఫ్యామిలీతో బాలకృష్ణ ఇంటికి

ఇందుకోసం సినీ దర్శకులు తేజ, నటుడు మురళీ మోహన్, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, రచయిత అనంత్ శ్రీరామ్ పార్టీ అధ్యక్షుడి ఇంటికి వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలపై వారితో చర్చించిన చంద్రబాబు... కొన్ని ట్యూన్‌లను విన్నట్లుగా సమాచారం. తదుపరి వాటి కోసం వారికి కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు దేవేందర్ గౌడ్, యనమల రామకృష్ణుడు, రేవంత్ రెడ్డి కూడా బాబుతో భేటీ అయ్యారు.
పర్యటనపై వారితో కాసేపు చర్చించారు. అనంతరం చంద్రబాబు తన కుటుంబంతో సహా సినీ హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. బాలయ్యతో పార్టీ బలోపేతంపై, తన రాష్ట్ర పర్యటనపై చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలయ్య పార్టీలో పోషించాల్సిన బాధ్యత, ఎప్పటి నుండి క్రియాశీలకంగా మారాలనే అంశంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
కాగా తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణతో పాటు బాబు తనయుడు నారా లోకేష్ కుమార్ కీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. ఇరువురికి పార్టీలో బాధ్యతలు అప్పగించే విషయమై పార్టీలో కొన్నాళ్లుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బాలకృష్ణతో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications