వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలా: విజయమ్మకు వర్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Varla Ramaiah
హైదరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు నిశ్చితార్థం అయిపోయిందని ఇక, పెళ్లే మిగిలి ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం ఎద్దేవా చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ తరఫున వాదిస్తున్న న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వం మార్చడం వెనుక సంకేతం ఇదేనన్నారు.

జగ్ అక్రమాస్తుల కేసు మొత్తం నీకిది నాకది చుట్టూ తిరుగుతోందని, కొత్త న్యాయవాదులకు కనీసం దీనిపై సరైన అవగాహన లేదన్నారు. కడపకు ఢిల్లీకి మధ్య పోటీ అన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు వైయస్ జగన్, వైయస్ విజయమ్మల పౌరుషం ఏమయిందని ప్రశ్నించారు. బైబిల్‌ను చేతిలో పెట్టుకొని విజయమ్మ అబద్దాలాడుతున్నారని, పవిత్ర గ్రంథాన్ని అవమానిస్తున్నారన్నారు.

విజయమ్మ తన కొడుకును ఆదర్శంగా తీసుకోవాలని యువతకు చెప్పగలరా అని ప్రశ్నించారు. జనవరి 5లోపు కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు విలీనం జరిగిపోతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆ మేరకు తమకు సమాచారముందని, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా అంతవరకు వాయిదా వేస్తుందన్నారు. విలీనం పూర్తయ్యాకే ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతికి కాంగ్రెసు పార్టీయే కారణమని, బాధ్యత అధిష్టానానిదేనని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె అల్లుడు రాబర్ట్ వధేరా, అధిష్టానం పెద్దలు, రాష్ట్ర ఇంచార్జులు అంతా వాటలు తీసుకున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

English summary
Telugudesam party leader Varla Ramaiah has questioned YSR Congress party honorary president YS Vijayamma that is YS Jaganmohan Reddy is ideal to youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X