రమ్మన్నదెవరు: రేణుక, కెసిఆర్ విమోచనకు సురేఖ

Renuka Chowdary
న్యూఢిల్లీ/ వరంగల్: తెలంగాణపై చర్చలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఢిల్లీకి ఎవరు రమ్మన్నారో తెలియదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు, అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి మార్పుపై తనకు సమాచారం లేదని ఆమె చెప్పారు. జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఆమె కోరారు. మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యలు శోచనీయమని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఆగస్టులో తెలంగాణ వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పిన మాటలు అబద్దమని తేలిపోయిందని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కనీసం కెసిఆర్‌కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కూడా లభించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, వరంగల్ గీసుకొండలో వైయస్సార్ కాంగ్రెసు దంపతులు కొండా మురళి, సురేఖ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వారు కెసిఆర్ విమోచన దినంగా నిర్వహించారు. దాదాపు ఐదు వేల మందితో కెసిఆర్ శవయాత్ర నిర్వహించారు. కెసిఆర్ తెలంగాణ తీసుకుని వచ్చి గాంధీ అవుతారో, డబ్బులకు అమ్ముడుపోయి తెలంగాణ హీనుడవుతారో ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని వారన్నారు.

ఇప్పటికే కెసిఆర్ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని వారు సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో తెలంగాణ సాధ్యమవుతుందని వారన్నారు. 2014లో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి తెలంగాణ తీసుకుని వస్తామని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+