వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్లీ బదులు బాబ్రీ అన్నఎపి లాయర్: కోర్టులో నవ్వులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Babli Project
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై మంగళవారం సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తమ తరఫు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. బాబ్లీపై విచారణనను సుప్రీం కోర్టు వచ్చే నెల 3వ తేదికి వాయిదా వేసింది. అయితే మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ తరఫున తన వాదనలు వినిపిస్తున్న న్యాయవాది పరాశరణ్ పలుమార్లు బాబ్లీ ప్రాజెక్టు పేరును పలకడంలో పొరబడ్డారు.

బాబ్లీపై గంభీరంగా వాదనలు సాగుతుండగా పరాశరణ్ పలుమార్లు పొరబాటు పడటంతో కోర్టులో నవ్వులు విరిశాయి. పరాశరణ్ బాబ్లీ ప్రాజెక్టుపై ఎపి తరఫున వాదనలు వినిపిస్తూ.. బాబ్లీ బదులు బాబ్రీ మసీద్. బాబ్రీ మసీద్ అని పలికారు. ఈ విషయాన్ని గ్రహించిన జస్డిస్ ఠాకూర్ మీరెందుకు పదే పదే బాబ్రీ మసీద్ అంటున్నారని నవ్వుతూ ప్రశ్నించారు.

జరిగిన పొరపాటును గుర్తించిన పరాశరణ్ వెంటనే తమాయించుకొని... తన మనువడితో బాబ్రీపై చర్చించడంతో అదే తన మనసులో పడిపోయిందని న్యాయమూర్తులకు వివరించారు. ఆ తర్వాత జస్టిస్ లోథా దానిని కొనసాగిస్తూ.. ఇది వరకు సీనియర్ న్యాయవాది పిపి రావు కూడా ఇలాగే పొరబడ్డారని చెప్పారు.

పిపి రావు మాధురీ పాటిల్‌కు బదులు బాలీవుడ్ సినీ నటి మాధురీ దీక్షిత్ పేరును పలికారని, అలాగే సుష్మా సూరీ కేసులో వాదిస్తూ.. ఆ పేరు పలకకుండా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ పేరు పలికారని గుర్తు చేశారు. దీంతో న్యాయస్థానం నవ్వులతో నిండిపోయింది.

English summary
Andhra Pradesh's lawyer Parasharan said Babri in 
 
 Surpeme Court in stead of Babli Project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X