ముంబై వ్యభిచార గృహాలపై దాడి: పదిమందికి విముక్తి

అధికారులు కాపాడిన పదిమంది మహిళల్లో మన రాష్ట్రానికి చెందిన వారు నలుగురు ఉండగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురు యువతులు ఉన్నారు. మన రాష్ట్రానికి చెందిన వారిలో ముగ్గురు 20 ఏళ్ల లోపు ఉండగా మరొకరు 35 ఏళ్ల లోపు ఉన్నారు. వీరు నలుగురు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యువతులు.
మహిళల అక్రమ రవాణా, వ్యభిచార గృహం నిర్వహణకు సంబంధించి అనిత, కృష్ణ, వీరమణి, నాగమణిలను నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఇందులో కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముగ్గురిని కోర్టులో హాజరుపర్చగా వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించనట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications