వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపిఏకు ములాయం ఆపన్న హస్తం: ఐనా ఉద్యమం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mulayam Singh Yadav
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ యూపిఏ ప్రభుత్వాన్ని ఆపద సమయంలో ఆదుకున్నారు. ఎఫ్‌డిఐ, పెట్రో పెంపు వంటి కేంద్రం నిర్ణయాలను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు మూడు రోజుల క్రితం ప్రకటించారు. శుక్రవారం టిఎంసి మంత్రులు రాజీనామా చేయనున్నారు.

మమత బయటకు వెళ్లిపోవడంతో సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి కష్టాల్లో పడింది. అయితే నిన్నటి వరకు బయటి నుండి యూపిఏకి మద్దతిస్తూ ఎటూ తేల్చని ములాయం ఈ రోజు కేంద్రానికి మద్దతు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి 19 మంది ఉన్న టిఎంసి మద్దతు ఉపసంహరించుకోగా 22 మంది ఉన్న ఎస్పీ తమ మద్దతు కొనసాగిస్తోంది. ఈ రోజు ములాయం సింగ్ ఢిల్లీలో మాట్లాడారు. యూపిఏకి తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

మతతత్వశక్తులకు అవకాశం రాకుండా ఉండేందుకే తాము యూపిఏకి మద్దతు పలుకుతున్నామని, అయితే ఎఫ్‌డిఐలు, పెట్రో పెంపులపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. యూపిఏకి మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రజా వ్యతిరేక కేంద్ర విధానాలపై తాము ఉద్యమిస్తామన్నారు. మతతత్వ శక్తులు లాభపడకుండా ఉండేందుకే తాము యూపిఏకి మద్దతిస్తున్నామని ఎస్పీ నేత గోపాల్ యాదవ్ చెప్పారు.

మరో నేత మోహన్ సింగ్ మాట్లాడుతూ... తాము రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐలకు ఎప్పుడూ వ్యతిరేకమని, కేంద్రం దీనిని వెనక్కి తీసుకోవాలని కోరారు. మమతా బెనర్జీ వైఖరిని తాము సమర్థిస్తున్నామన్నారు. మరో నేత మాట్లాడుతూ తమ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రధాని అయ్యే అర్హత ఉందన్నారు.

English summary
With the UPA government flummoxed by the Trinamool Congress' decision to pull out of the government, it now seems that Samajwadi party (SP) is ready to step in and provide some much needed relief for the UPA. The offer of support comes at a time when the Centre will be reduced to a minority after the TMC Minister's submit their resignations today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X