వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానికి చేదు అనుభవం: ఒ వ్యక్తి చొక్కా విప్పి నిరసన

By Pratap
|
Google Oneindia TeluguNews

Protester goes shirtless in front of PM
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలపై దూకుడు ప్రదర్శించిన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రసంగం చేస్తుండగా ఓ వ్యక్తి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సమ్మేళనంలో ప్రధాని ప్రసంగిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

అయితే, దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. నిరనస వ్యక్తం చేసిన వ్యక్తిని న్యాయవాదిగా పోలీసులు గుర్తించారు. చిల్లర వర్తంలోకి ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి నిరసనకు దిగినట్లు తెలుస్తోంది.

ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చొక్కా విప్పి నిరసన తెలిపిన 33 ఏళ్ల సంతోష్ కుమార్ సుమన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక రక్షణ దళానికి చెందిన గార్డులు తుగ్లక్ రోడ్డులోని పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అందరిపై ఉందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలపై సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.

English summary
A man raised slogans against Prime Minister Manmohan Singh and attempted to disrupt his speech at a conference in New Delhi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X