వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిఎల్పీ బోర్డు తీసిన నాగం: 29న తెలంగాణ.. శంకరన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy - Shankar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి కొద్ది నెలల క్రితం గుడ్ బై చెప్పిన తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి శనివారం తెలుగుదేశం పార్టీ శాసనసభా కార్యాలయానికి వెళ్లారు. శనివారం సభ వాయిదా పడిన అనంతరం టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి టిడిఎల్పీ కార్యాలయంలో కూర్చున్నారు. ఆ సమయంలో ఆ గది ముందు నుండి నాగం వెళుతుండగా రావుల చూశారు. అతనిని లోపలకు ఆహ్వానించారు.

అందుకు నాగం.. తాను లోనికి వస్తానని, కానీ గది ముందు గోడకు ఉన్న టిడిఎల్పీ బోర్డును తీసివేయాలని సూచించారు. కాసేపటి తర్వాత నాగం జనార్ధన్ రెడ్డే ఆ బోర్డు తీసేసి, గది లోపలకు వచ్చి రావులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ మంత్రి శంకర రావుకు నాగం తారసపడ్డారు. శంకరన్న నాగంతో కాసేపు మాట్లాడారు. అనంతరం నాగంను బిజెపి, లోక్‌సత్తా శాసనసభా పక్ష కార్యాలయాలకు తీసుకు వెళ్లారు.

లోక్‌సత్తా కార్యాలయంలో జెపితో శంకర రావు మాట్లాడుతూ... నాగం జనార్దన్ రెడ్డి తన క్లాస్ మేట్ అని, చదువుకునే రోజుల నుంచి తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యముందని చెప్పారు. కాగా అంతకుముందు శంకర రావు శాసనసభ లాబీల్లో ఇతర నేతలతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రభుత్వం ఈ నెల 29న కీలక ప్రకటన చేస్తుందని, దీనికి సంబంధించి తన వద్ద పక్కా సమాచారముందని చెప్పారు.

తాను ఎప్పుడూ అబద్దం చెప్పలేదని, వాస్తవం చెబుతున్నానని, 30న తెలంగాణ మార్చ్ నిర్వహించాల్సిన అవసరం రాకపోవచ్చునని, సీమాంధ్ర నేతలతో జాగ్రత్తగా ఉందామని, వారు సమైక్య రాష్ట్రం పేరుతో మాయ చేయడానికి సిద్ధమవుతున్నారని శంకర రావు ఇతర తెలంగాణ ప్రాంత నేతలను హెచ్చరించారు.

English summary
Nagarkurnool MLA Nagam Janardhan Reddy has removed TDLP board on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X