దేవుడు చూస్తున్నాడు, ఎమర్జెన్సీ: గాలి జనార్ధన్ రెడ్డి

విజయ రాఘవకు బెయిల్
ఎమ్మార్ కేసులో నిందితుడు విజయ రాఘవకు నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. సిబిఐ విజయ రాఘవను జనవరి 28న ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసింది. ఎమ్మార్ విల్లాల డాక్యుమెంట్లు తారుమారు చేశాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు. ఈరోజు ఆయనకు బెయిల్ లభించింది.
ఐఎంజి భారత్ భూ కుంభకోణం కేసులో సిబిఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కేటాయించిన ఐదు భూకేటాయింపులపై గతంలో విచారణ జరిపినట్లు సిబిఐ కోర్టుకు కేసు వివరాలను అందించింది. కోర్టు ఆదేశిస్తే ఇప్పుడు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిబిఐ తెలిపింది.












Click it and Unblock the Notifications