వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరి తీయాల్సిందే: కసబ్ క్షమాభిక్షకు మహారాష్ట్ర నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
ముంబయి: ఉరిశిక్ష ఖరారైన ముంబయి మారణ హోమం నేరస్తుడు అజ్మల్ కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర హోం డిపార్టుమెంట్ రిజెక్ట్ చేసింది. క్షమాభిక్ష కోసం కసబ్ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించి.. దాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించామని.. ఆ రాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఇక ఈ పిటిషన్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్ర హోంశాఖకు పంపిస్తుంది.

తర్వాత తమ ప్రతిపాదనలతో కేంద్ర హోంశాఖ కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. క్షమాభిక్ష విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన వెంటనే ఈ నెలారంభంలో కసబ్ క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర హోం డిపార్టుమెంట్... కసబ్‌ను వెంటనే ఉరి తీయాలని పేర్కొంది. మహా ప్రభుత్వం కూడా కసబ్‌ను ఈ నవంబరులో ఉరి తీసేందుకు అన్ని అరేంజ్‌మెంట్స్ చేస్తోందని తెలుస్తోంది. మహా హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి కసబ్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు.

కసబ్‌కు విధించిన ఉరిశిక్షను తక్షణమే అమలు చేయాలని డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివసేన అధినేత బాల్ థాకరే కసబ్ క్షమాభిక్షను ఆలస్యం లేకుండా తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఇటీవలే డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలు కూడా కసబ్‌ను ఉరి తీయాల్సిందేనని చెబుతున్నాయి.

English summary
Ajmal Kasab's mercy petition, addressed to president Pranab Mukherjee, has been rejected by Maharashtra's homi ministry, days after the lone survining perpetrator of 26/11 Mumbai terror attacks set in motion the last option available to save his life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X