తెలంగాణ మార్చ్‌కు ఎమ్మెల్యే జయసుధ మద్దతు

కాగా, తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి కోరారు. జీవవైవిధ్య సదస్సు, వినాయకుడి నిమజ్జనం ఉన్నందున మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కోరుతున్నట్లు ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. తెలంగాణ మార్చ్‌లో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని, అసాంఘిక శక్తులు చొరబడి మతకల్లోలాలు సృష్టిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుడు కె. కేశవరావు బాధ్యత వహిస్తారా, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ బాధ్యత వహిస్తారా అని అడిగారు.
గత యాభై ఏళ్లలో పరిష్కారం కాని తెలంగాణ సమస్య మార్చ్‌తో పరిష్కారమవుతుందా అని జగ్గారెడ్డి అడిగారు. తెలంగాణ మార్చ్ వెనక రాజకీయ ఎజెండా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, దేశ సమస్యల కన్నా తెలంగాణ సమస్య పెద్దది కాదని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పదిహేను రోజుల తర్వాత తమ పార్టీ అధిష్టానం తెలంగాణ అంశంపై దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కాంగ్రెసు శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. లేదా స్థలమైనా మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము తెలంగాణ మార్చ్‌ను వ్యతిరేకించడం లేదని, జీవవైవిధ్య సదస్సు నేపథ్యంలోనే వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications