తెర వెనక కెవిపి ఆటంకాలు: తెలంగాణపై యాష్కీ

తెలంగాణ ఎక్కడ ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవి ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని మండిపడ్డారు. తెలంగాణ ఈ తేదీలో వస్తుందని కేంద్రం ఎప్పుడూ ప్రకటించలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంపీల తరపున రాజకీయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. అరెస్టులు, అణచివేతలతో తెలంగాణ మార్చ్‌ను ఆపలేరని హెచ్చరించారు. ఎంత అణిచివేస్తే అంత ఉద్యమ సెగ తగులుతుందన్నారు.
రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ ఆధినాయకత్వాన్ని ఒప్పిస్తామని చెప్పారు. ఇప్పటికే 8మంది తెలంగాణ ఎంపీలు కోదండరాం, కేసీఆర్‌తో కలిసి మార్చ్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారని ఎంపీ వివరించారు. మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం లక్షలాది మంది పోలీసులను రంగంలోకి దించిందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు.
కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన ఇస్తే రాజీనామా చేస్తానని యాష్కీ స్పష్టం చేశారు. సమైక్య ఆంధ్రా అనేవాడిని తెలంగాణలో తిరగనివ్వకూడదని పిలుపునిచ్చారు. కేవీపీ రాంచందర్‌రావు తెరవెనుక ఉండి తెలంగాణ రాకుండా అడ్డు పడుతున్నాడని మధుయాష్కీ ఆరోపించారు.












Click it and Unblock the Notifications