వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు టైం పడుతుంది, ఇంకా చర్చలు: ఆజాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
శ్రీనగర్: తెలంగాణ అంశంపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ బుధవారం శ్రీనగర్‌లో అన్నారు. ఏకాభిప్రాయానికి మరింత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం తర్వాతనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై ఇంకా ఇరు ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందన్నారు. చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ అత్యంత క్లిష్టమైన సమస్య అన్నారు.

మహారాష్ట్ర క్రైసిస్ పైన కూడా ఆజాద్ స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ యూపిఏ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారుడు అని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌తో కాంగ్రెసుకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు, ఎన్సీపికి కూడా ఎలాంటి విభేదాలు లేవన్నారు. అజిత్ తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

కాగా ఈ నెలాఖరులోగా తెలంగాణపై, కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనంపై ప్రకటనలు వెలువడుతాయంటూ సంకేతాలు ఇచ్చిన కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా వెనక్కి తగ్గినట్లే చెప్పవచ్చు. ఈ రోజు ఆజాద్ మాత్రమే కాకుండా మంగళవారం కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి తెలంగాణపై ఆశలను తుంచేశారు. తెలంగాణ ఎక్కడుందని ఆయన ఏకంగా ప్రశ్నించారు. తెలంగాణపై తాము ఆలోచించడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై ఇప్పట్లో ప్రకటన ఉండదని స్పష్టం చేశారు.

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో సమావేశంలో తెలంగాణపై చర్చించలేదని స్పష్టం చేశారు. అధిష్టానం జాతీయ అంశాలతోనే బిజీగా ఉందని, తెలంగాణపై ఆలోచన చేయడం లేదని అన్నారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై ప్రశ్నించగా, ఆ విషయం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే అడగాలని వాయలార్ రవి చెప్పారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ మార్చ్ ఉందని, హింస ప్రజ్వరిల్లవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మీడియా ప్రతినిధులు అన్నప్పుడు ఆయన అదో రకంగా పెదవి విరిచారు.

కెసిఆర్ తనను కలిశారని, తెరాస విలీనం విషయం పెద్ద విషయమని ఆయన అన్నారు. తాను తెలంగాణపై కెసిఆర్‌తో చర్చలు జరుపుతున్నట్లు గతంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన వాయలార్ రవి ఏకంగా అదేమిటో తెలియదన్నట్లు మాట్లాడారు. నేడో రేపో కెసిఆర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని కూడా వార్తలు వెలువడ్డాయి. మొత్తం మీద, అందరి అనుమానాలను నిజం చేస్తూ కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

English summary
The Union Minister and state Congress party incharge Ghulam Nabi Azad said that there will be no statement on Telangana now. He said that Congress high command is not thinking about Telangana, Decision on Telangana will take time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X