• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజకీయ నేతల ఎదుటే నటిపై ఆత్యాచార యత్నం

By Pratap
|

 Model molested at home in Bengal as politician and realtors watch
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని చందర్నగోర్‌లో ఈ నెల 20వ తేదీన జరిగిన ఓ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ రాజకీయ నాయకుడు, రియల్టర్లు చూస్తుండగా నటి, మోడల్ అయిన ఆరిత్రి భట్టాచార్యపై అత్యాచార యత్నం జరిగింది. ఆమెను, ఆమె తల్లిని విపరీతంగా కొట్టారు. దుండగుడు తన దుస్తులు విప్పేసి, తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారని అరిత్రి ఆరోపిస్తోంది. అందరూ చూస్తుండగా ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అరిత్రి చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దెబ్బలతో అరిత్రికి, ఆమె తల్లికి గాయాలై నెత్తురోడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా, ఇరు పక్షాల మధ్య సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. నిందితుడిని పోలీసులు సెప్టెంబర్ 24తర్వాత గానీ అరెస్టు చేయలేదు. అతనిపై చిన్న కేసులు పెట్టి కొద్ది గంటల్లోనే అతన్ని వదిలేశారు. యాసిడ్ దాడి చేస్తానంటూ అతను బయటకు రాగానే అరిత్రిని బెదిరిస్తున్నాడని ఆరోపణలున్నాయి.

అరిత్రి 2006లో మిస్ ఇండియా టాప్ 22లో చోటు చేసుకుంది. టీవి కమర్షియల్స్, సీరియల్స్‌ ద్వారా ఆమె చాలా మందికి తెలుసు. చందర్నగోర్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొనుక్కుని ఆమె తన తల్లిదండ్రులు, భర్త మృణ్యోయ్‌తో ఉంటోంది. అపార్టుమెంటు డెవలపర్స్ సుమిత్ సుర్, ఆశిష్ ముఖర్జీ అదే అపార్టుమెంటులో ఉంటారు. వారికి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీసు ఉంది. అది ఆరిత్రి పడకగది పక్కనే ఉంటుంది.

ప్రతి రోజు డెవలపర్స్, పనీపాటా లేని కొంత మంది స్థానికలు ఆ కార్యాలయంలో చేరుతారని అరిత్రి తల్లి జ్యోతి అంటోంది. అసభ్యంగా, గట్టిగా మాట్లాడతూ ఉంటారని, రాత్రి పొద్దుపోయే వరకు అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారని ఆమె చెప్పింది. ఈ విషయంపై అరిత్రి తల్లి డెవలపర్స్ ఇద్దరికీ ఆ విషయం చెప్పింది. మరో ఆరు నెలల తర్వాత తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

సెప్టెంబర్ 20వ తేదీన సుర్ డ్రైవర్ నిషాద్ అరిత్రి ఇంటి ద్వారం వద్దనే అవాంఛనీయమైన పని చేశాడు. ఫోన్లో అసభ్యంగా మాట్లాడసాగాడు. దీంతో అరిత్రి కుటుంబ సభ్యులు తలుపులు మూసేసి, గొల్లెం పెట్టుకున్నారు. దాంతో సుర్ ఆగ్రహంతో బయట ఆరేసిన అరిత్రి దుస్తులను తీసేసి పారేయడం ప్రారంభించాడు.

అరిత్రి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాంతో నిషాద్ అరిత్రిపై దాడి చేశాడు. టీ- షర్ట్, పైజామా చించేశాడని అరిత్రి చెబుతోంది. రక్షించాలని కోరడానికి అరిత్రి తల్లి సుర్, ముఖర్జీల వద్దకు వెళ్లింది. అక్కడ స్థానిక రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ వారెవరూ రక్షించడానికి ముందుకు రాలేదు. దీంతో అరిత్రితో పాటు తల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే, ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించి, మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.

దాంతో కాదని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించడంతో సెప్టెంబర్ 22వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని జ్యోతి చెబుతోంది. అయితే, ఆరోపణలను ముఖర్జీ కొట్టి పారేస్తున్నాడు. చిన్న పాటి గొడవ జరిగిందని సుర్ అంటున్నారు.

English summary
Model-actor Aritri Bhattacharya and her mother were beaten up and molested in their home in the presence of a politician and realtors in Chandernagore on September 20. Aritri says the attacker stripped her and tried to rape her in front of the gawking crowd but she managed to fight him off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X