మహిళ భర్తను హత్య చేసిన ఆమె మాజీ ప్రియుడు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాదవ్ 2006లో ముంబై వచ్చి ఓ బ్యాంకులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడని, 2007 నుంచి పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడని, హతుడూ అతని కుటుంబ సభ్యులు నివసించే హనుమాన్ నగర్‌లో ఉంటూ వస్తున్నాడని పోలీసులు చెప్పారు.
విశ్వకర్మ ఇంటిలో యాదవ్ 2008లో హతుడి పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు. ఈ స్థితిలో యాదవ్‌కు, హతుడి భార్య రేఖకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం 2010లో విశ్వకర్మకు తెలిసింది. యాదవ్‌ను పక్కన పెట్టేశాడు. రేఖ కూడా అతనితో సంబంధాలు తెంచుకుంది.
యాదవ్, స్క్రాప్ డీలర్ అయిన అతని మిత్రుడు దామన్‌లోని ప్రమోద్ వర్మ 2011 నవంబర్‌లో విశ్వకర్మను చంపడానికి పథకం వేసుకున్నరు. వర్మ కస్టమర్‌గా నటించి సెప్టెంబర్ 16వ తేదీన అతన్ని తన ఇంటికి పిలిచాడు. విశ్వకర్మకు అనుమానం వచ్చి వరమ్మ మొబైల్ నెంబర్ నోట్ చేసుకున్నాడు.
విశ్వకర్మ తన గదికి రాగానే వర్మ తన మిత్రుడితో కలిసి విశ్వకర్మను హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలోని నల్లాలో పడేశారు. విశ్వకర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాతి రోజు విశ్వకర్మ మృతదేహం నల్లాలో బయటపడింది. విశ్వకర్మ మొబైల్‌లోని నెంబర్ ఆధారంగా వర్మను పోలీసులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications