విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలం లేకే: తెలంగాణపై కిరణ్, తీసిపారేయొద్దు.. డిసిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Damodara Rajanarasimha
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. ఇందిర బాట కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణ విషయమై పార్టీలోని అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రంలో కాంగ్రెసుకు తగినంత బలం లేదన్నారు. తెలంగాణ చాలా క్లిష్టమైన అంశమని, ఏకాభిప్రాయం అవసరమన్నారు.

మొదట కాంగ్రెసు నేతల మధ్యనే ఏకాభిప్రాయం లేదన్నారు. తక్షణ పరిష్కారం అంటే కష్టమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి గడువు విధించడం సరికాదన్నారు. కేంద్రం, కాంగ్రెసు కూడా ఈ అంశంపై సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చూపిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయం కోసం కేంద్రం కృషి చేస్తోందని అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై వ్యాఖ్యలు పిటిఐతో చెప్పారు.

గుండెకోత నుండి పుట్టింది.. దామోదర

తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం, గుండెకోతతో పుట్టిన ఉద్యమమని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదులో అన్నారు. 50 ఏళ్లలో 48 ఏళ్లు తెలంగాణేతరులే రాష్ట్రాన్ని పాలించారని ఆయన ఆర్ధ్రతతో చెప్పారు. కడుపు మంటతో గుండె కోతతో కూడిన అంశం తెలంగాణ అన్నారు. సహజంగానే తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే అనుమానం తమందరిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతి ఒక్కరికీ తమ భాష పట్ల, ప్రాంతం పట్ల, కులం పట్ల ప్రీతి ఉంటుందన్నారు. ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసి పారేయవద్దని సూచించారు. ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యువత, విద్యార్థి సంఘాలు ఎవరు కూడా హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి వారికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. మార్చ్ పైన ముఖ్యమంత్రికి తమ అభిప్రాయం చెబుతామన్నారు.

English summary
CM Kiran Kumar Reddy on thursday said in his Krishna district tour that Congress party is trying to solve Telangana issue soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X