బాబు లేఖను లైట్‌గా తీసుకున్న కిరణ్, మార్చ్‌పై తర్జన

ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖను తాను తేలిగ్గా తీసుకున్నానని చెప్పారు. బాబు గతంలో రాసిన లేఖకు ఈ లేఖకు తేడా ఏమీ లేదని, అందులో కొత్త ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ని విరమింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కిరణ్ చెప్పారు. ఇదే విషయమై కిరణ్ హైదరాబాదులో ఉన్న తెలంగాణ ప్రాంత మంత్రులతోను, పార్టీ అధిష్టానంతోనూ మాట్లాడారు.
తెలంగాణపై త్వరలో కేంద్రం సరైన నిర్ణయాన్ని వెలువరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజారంజక నిర్ణయం వెలువడేలా చూస్తామన్నారు. మార్చ్ విరమణ కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. చివరి వరకు ప్రయత్నాలు చేసి... కుదరకపోతే రైల్ రోకో తరహాలు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్చ్ పైన అవసరమైతే కఠిన వైఖరి అవలంభించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications