మార్చ్‌కు టిటిడిపి మద్దతు: బేరాలాడుతున్న కెసిఆర్

మార్చ్‌కు మద్దతుగా రేపు, ఎల్లుండి మండలు, జిల్లా కేంద్రాలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో స్పష్టత ఉందన్నారు. దానిని వక్రీకరించి కొందరు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2008లో ఇచ్చిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని చంద్రబాబు చెప్పారన్నారు.
కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే పార్టీ తరఫున ఒక్క ప్రతినిధినే పంపిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అఖిలపక్ష సమావేశం కోసం ఎందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఏ ప్యాకేజీకి ఆయన అమ్ముడు పోయారో చెప్పాలన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు రానంత బిజీగా ఢిల్లీలో కెసిఆర్‌కు ఏం పనుందన్నారు.
21 రోజులుగా కెసిఆర్ ఢిల్లీలో ఎవరితో లాలూచీ పడుతున్నారని ప్రశ్నించారు. కెసిఆర్, కెటిఆర్ ఇద్దరు తండ్రీ కొడుకులు కలిసి ఢిల్లీలో బేరాలు ఆడుతున్నారా అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ స్పష్టంగా ఇస్తే విమర్శిస్తున్న కెసిఆర్... కాంగ్రెసు పార్టీ పెద్దలు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవిలు తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications