హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ నేనే సిఎం, పాలనను గాడిలో పెడతా: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని, రాష్ట్రంలో పాలన గాడిలో పెడతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముస్లింలకు భరోసా ఇచ్చారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో మైనారిటీ డిక్లరేషన్ పేరుతో ముస్లింలకు పలు వరాలు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు 15 సీట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. చట్టసభల్లో ముస్లింలకు 8శాతం వాటా ఉండాలని అన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే, ముస్లిం మహిళలకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందించనున్నట్టు, ప్రత్యేక ఉర్దూ డిఎస్‌సి నిర్వహించనున్నట్టు తెలిపారు. ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని, మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. 62ఏళ్ల వయసులో తనకేమీ కోరికలు లేవని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే పాదయాత్ర చేయాలని నిర్ణయించనున్నట్టు తెలిపారు.

ప్రజలను చైతన్య పరిచేందుకే పాదయాత్ర అని, ఈ యాత్రతో చరిత్ర సృష్టిస్తానని అన్నారు. మైనారిటీల పరిస్థితి దయనీయంగా ఉందని, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన తొలుత తమ పార్టీదేనని అన్నారు.ఉర్దూ రెండవ భాషగా అమలు కావడానికి ఇతోధికంగా కృషి చేయనున్నట్టు తెలిపారు. మదర్సాలలో చదివే వారికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు.

ప్రతి జిల్లాలో ముస్లింలకు పదివేల ఇళ్ల నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్‌కార్డ్ ఏర్పాటుపై పార్టీలో చర్చిస్తున్నట్టు తెలిపారు. ముస్లింల స్థితిగతులపై సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీలను ఏర్పాటు చేశారని, వారిచ్చిన నివేదికలను అమలు చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu saif that he will become CM again and administration will be strteamelined. He announced sops to Muslim minorities in the name of minority declaration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X