కెసిఆర్ చర్చల వివరాలు వెల్లడించలేరు: పోచారం

కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో కెసిఆర్ చర్చలు జరుపుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ వస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై కెసిఆర్ కేంద్రానికి ఇచ్చిన గడువు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందని, ఆలోపు అనుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖలో స్పష్టత లేదని ఆయన అన్నారు. తాము తెలంగాణకు అనుకూలమని లేఖలో ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. 2008లో తెలంగాణపై లేఖ ఇచ్చామని అన్నారే గానీ దానికి కట్టుబడి ఉన్నామని చెప్పలేదన్నారు. చంద్రబాబు లేఖ కొత్త సీసాలో పాత సారా లాగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా అరెస్టులు చేస్తే ప్రభుత్వం చేతులు కాల్చుకున్నట్లేనని ఆయన అన్నారు.
కెసిఆర్ ఢిల్లీలో ఉన్నంత మాత్రాన తెలంగాణ ఉద్యమం ఆగేది లేదని, తెలంగాణ మార్చ్‌లో పాల్గొనాలని తమకు చెప్పారని చెన్నమనేని రమేష్ అన్నారు. కెసిఆర్ సైతం కాంగ్రెసు పార్టీని విశ్వసించడం లేదని అన్నారు. గత 60 ఏళ్లుగా కాంగ్రెసు పార్టీ తెలంగాణను మోసం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ మార్చ్ ఉద్యమానికి నాంది మాత్రమేనని, తర్వాత మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications