గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుపై ఒత్తిడికే రాశారు: బాబు లేఖపై రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం కాదని, అలాగని సమైక్యాంధ్రకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు రాసిన లేఖ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమంటూ చెప్పలేదని నిశితింగా పరిశీలిస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాత్రమే ఉందన్నారు. అలాగని సమైక్యాంధ్రకు వ్యతిరేకం కాదన్నారు.

కేవలం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు మాత్రమే చంద్రబాబు లేఖ రాసినట్లున్నారని అన్నారు. ఈ లేఖపై ప్రధానమంత్రి స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుందని రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ సమావేశంలో తమ వైఖరిని చెప్తామని చంద్రబాబు ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణపై చంద్రబాబు రాసిన లేఖ స్పష్టంగా లేదని తెలంగాణవాదుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపుగా అదే అభిప్రాయాన్ని రాయపాటి సాంబశివ రావు వెల్లడించారు.

English summary
Congress Guntur MP Rayapati Sambasiva Rao said that Telugudesam party president N Chandrababu Naidu's letter written to PM Manmohan Singh is not positive to Telangana. Chandrababu intended to put pressure on Congress through his letter, he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X