నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బయటకొస్తాడు: జగన్ కోసం మేకపాటి మహాపాదయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
నెల్లూరు/హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజల్లోకి వస్తారని, ప్రజా ఉద్యమాలలో పాల్గొంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం అన్నారు. జైలు నుంచి జగన్ నిర్దోషిగా బయటకు రావాలని కోరుతూ ఆయన నెల్లూరు నుంచి నృసింహకొండ వరకు మహాపాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పద్నాలుగు కిలోమీటర్లు నడిచిన మేకపాటి నృసింహకొండపై శ్రీ వేదగిరి లక్ష్మీనృసింహ స్వామి, ఆదిలక్ష్మీ అమ్మవార్ల సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఎటువంటి నేరారోపణలు లేకుండా జగన్ బయటకు రావాలని ప్రార్థించారు. అంతకముందు జొన్నవాడ రేవు సెంటరులో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మేకపాటి ఆవిష్కరించారు.

కాంగ్రెస్‌పై టిడిపి ఆగ్రహం

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు కుట్ర చేస్తున్నాయని మండలి ప్రతి పక్షనేత దాడి వీరభద్ర రావు హైదరాబాదులో ఆరోపించారు. టిడిపి హయాంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై దివంగత వైయస్ హయాంలో 26 విచారణలు చేసినా అన్నీ నిబంధనల మేరకే జరిగాయని నివేదికలు వెల్లడించాయన్నారు.

తెలంగాణ సమస్య పరిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వగానే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావులు ఉలిక్కిపడ్డారని టిడిపి ఉపాధ్యక్షుడు ఇనగాల పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌కు రాష్ట్రవిస్తృత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ లేఖతో తమ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే కేసీఆర్, కేటీఆర్‌లు తమ పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ... కెసిఆర్, వైయస్ జగన్‌లను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

English summary
Nellore MP Mekapati Rajamohan Reddy was make padayatra for YSR Congress party chief and YS Jaganmohan Reddy's release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X