వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేపాల్‌లో విమానం కూలి 19 మంది దుర్మరణం

లూక్లాకు వెళ్లడానికి బయలుదేరిన విమానం కూలడంతో అందులోని 16 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది మరణించారు. ఆ విమానం సీతా ఎయిర్‌వేస్‌కు చెందింది. విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరింది. అది గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విషాద వార్త వినాల్సి వచ్చింది.
గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దాంతో విమానం కోటేశ్వోర్ ప్రాంతంలోని మనహార నది ఒడ్డుపై కూలిపోయింది. ప్రమాద స్థలం విమానాశ్రయానికి దక్షిణాన రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇటలీకి చెందినవారు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
విమాన సిబ్బందిని కెప్టెన్ బిజయ టండూకర్, కో పైలట్ తకేసి థాపా, ఎయిర్ హోస్టెస్ రాజు శంక్యాగా గుర్తించారు. ప్రయాణికులను గుర్తించాల్సి ఉంది.