వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌నే అడగండి, కొన్ని చెప్పలేం: రేణుకా చౌదరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Choudhary
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరుగుతున్నాయో, లేదో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే అడిగి తెలుసుకోవాలని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి సూచించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కెసిఆర్‌తో ఆస్కార్ ఫెర్నాండేజ్ భేటీ గురించి తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురి చేస్తుందన్న వ్యాఖ్యపై స్పందిస్తూ - మీడియా అడిగిన వాటన్నింటికీ సమాధానం ఇస్తే ప్రజల్ని అ యోమయానికి గురిచేసినట్లా? అని ప్రశ్నించారు.

కొన్ని చర్చల గురించి బహిరంగంగా మీడియాకు వెల్లడించలేమని, కొంత పురోగతి సాధించే వరకూ గుట్టుగా సాగించి, తర్వాత బయట పెట్టే చర్చలు కూడా ఉంటాయన్నారు. ఇది ప్రజల్ని అ యోమయానికి గురి చేయడమని అనుకోవటం దురదృష్టకరమన్నారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి, సమయానికి తగినట్లుగా వాస్తవాలేంటో తాము చెబుతామన్నారు. అంతకు ముందు కానీ, తర్వాత కానీ తాము చెప్పలేమన్నారు.

చర్చలు జరుగుతున్న సంగతి వాస్తవమేనా? అని ప్రశ్నించగా - జరుగుతున్నాయో, జరగటం లేదో తనకు తెలియదని చెప్పారు. గుట్టుగా జరుగుతున్నాయో, లేదో కూడా తనకు తెలియదన్నారు. బహిరంగంగా మీడియా ముందు అయితే జరగటం లేదని, జరగవని స్పష్టం చేశారు. ప్రజల్ని రెచ్చగొట్టేలా కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు ఉన్నాయని అంటే, మీడియా వాస్తవాలు ప్రచురించాలని కోరారు.

వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు తనకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాసిన లేఖను తాను చదవలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ కవాతుపై స్పందించేందుకు, విరమించుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు ఆమె నిరాకరించారు. దీనిపై స్పందించే అధికారం తనకు లేదని, తనకు ఎలాంటి సూచనలూ లేవన్నారు.

అయినా, ఇదేమీ ఎఐసిసి పని కాదని, రాష్ట్ర ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. తనకు వ్యక్తిగత అభి ప్రాయం లేదని, పార్టీ తనకు అప్పజెప్పిన పని మేరకే తాను వ్యాఖ్యానిస్తానన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీగా తనకు వేరే అభి ప్రాయం ఉండొచ్చని, తన ఆలోచనలు వేరుగా ఉండొచ్చన్నారు. కవాతుకు అనుమత్వివక పోతే మరింత విధ్వంసం జరుగుతుందన్న ప్రకటనల్ని ప్రస్తావించగా.. ఏ అనుమతి ఇవ్వలేదని కావూరి సాంబశివరావు ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. అనుమతి ఇచ్చారని చేశారా? ఇవ్వలేదని చేశారా? అని ప్రశ్నించారు.

మిలీనియం మార్చ్ సందర్భంగా విధ్వంసం చెలరేగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుందన్న ప్రజల ఆందోళనల్ని ప్రస్తావించగా.. సంబంధిత వ్యక్తులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారని, దీనిని వారికే వదిలేయాలని సూచించారు. దీనిపై మరింత ఎక్కువ మాట్లాడేందుకు తనకు అధికారం లేదన్నారు. తెలంగాణపై నిర్ణయం కోసం 2014 వరకూ ఆగాలో, అవసరం లేదో త్వరలోనే తెలుస్తుందని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

English summary
AICC spokesperson Renuka Chowdhari asked media persons to ask Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao on his talks with Congress high command leaders. She said that some issues will not be disclosed to the media, till they take shape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X