errabelli dayakar rao telugudesam telangana mothkupalli narasimhulu hyderabad ఎర్రబెల్లి దయాకర రావు తెలుగుదేశం తెలంగాణ మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్
మద్దతు అడిగినవారు లేరు: తెలంగాణ మార్చ్‌పై ఎర్రబెల్లి

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు రేపటి తెలంగాణ కవాతులో పాల్గొనాల్సిన అవసరం లేదని, సోనియా గాంధీ ఇంటి వద్ద కూర్చోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కవాతులో పాల్గొంటే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ కోసం కాంగ్రెసు నేతలు వారి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి వద్ద ధర్నా చేయాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. తెలంగాణపై అఖిల పక్షం పెట్టాలని తాము డిమాండ్ చేస్తే కొందరు సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానికి రాసిన లేఖలోని అంశాలను అర్థం చేసుకోలేనివారే తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు రాకుండా కెసిఆర్ ఎక్కుడున్నారని ఆయన అడిగారు. కుటుంబ సభ్యులతో కలిసి కెసిఆర్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమిటని మోత్కుపల్లి అడిగారు.