గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోదండరామ్‌ను తరిమికొట్టండి: సమైక్యాంధ్ర జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
గుంటూరు/ విజయవాడ: తెలంగాణలో రాజకీయ నిరుద్యోగులైన దొరలు, పెత్తందార్లకు వత్తాసు పలుకుతూ తెలంగాణ వేర్పాటు ఉద్యమం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న జెఎసి ఛైర్మన్ కోదండరాంను రాష్ట్రం నుండి తరిమికొట్టాలని సమైక్యాంధ్ర బలహీనవర్గాల జెఎసి పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం గుంటూరులో జెఎసి నాయకులు వైవి సురేష్, ఎండి హిదాయత్, హనుమంతురావు తదితరులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇస్తే సమైక్యాంధ్ర ఆత్మాహుతి దళం కోందడారం తదితరులపై పడి చంపుడా లేదా చచ్చుడా తేల్చుకుంటుందని హెచ్చరించారు.

తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని కోరే ఎంపి, మంత్రులు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్చ్ జరిగితే ట్యాంక్ బండ్‌పై ముందు వరుసలో కోదండరాం, కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవిత తదితర తెరాస, జెఎసి నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఉండాలన్నారు. సమైక్య వాదాన్ని వినిపించేందుకు సమైక్యాంధ్ర సంరక్షణ సమితి విజయవాడ ప్రకాశం బ్యారేజిపై ఈ నెల 30న తలపెట్టిన మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని సమైక్యాంధ్ర మార్చ్‌కు అనుమతి నిరాకరించినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ టి.హరికృష్ణ తెలిపారు.

సమైక్యవాదుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనటానికి ఈ నెల 30న తాము తలపెట్టిన సమైక్యాంధ్ర మార్చ్‌కు నగరంలో అనుమతి నిరాకరించడమే నిదర్శనమని సమైక్యాంధ్ర సంరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి అన్నారు. ఈ విషయమై స్థానిక పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జోక్యం చేసుకొని అనుమతి ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు.

లేనిపక్షంలో నాలుగు రోజుల్లో తాము ఓ ప్రణాళికను రూపొందించి ప్రణాళికాబద్దంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమైక్యాంధ్ర ప్రాంతంలోని సమైక్యవాదులు వారి వారి ప్రాంతాల్లోని గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి గాంధీ మార్గంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులకు సమైక్యవాదులు ఉత్తరాలు రాయనున్నట్టు తెలిపారు.

English summary
Samaikyandhra JAC lashed out at Telangana political JAC chairman Kodandaram. Telangana JAC leader Kodandaram is playing divisive politics, it criticized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X