రూ. 7.50 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డు

హైదరాబాద్ సమీపంలోని బాలాపూర్ గణేశుడి లడ్డు నిరుడు 5.45 లక్షల రూపాయలు పలికింది. ఈసారి లడ్డుకు పోటీ మరింత తీవ్రమైంది. వేలం పాటలో 18 మంది పోటీ పడ్డారు. శనివారం ఉదయం లడ్డు వేలం పాట ప్రారంభమైంది. వేలంపాటలో లక్షలు, వేలు పెరుగుతూ చివరికి లడ్డు ధర రూ.7.50 లక్షల రూపాయలు పలికింది.
బాలాపూర్ లడ్డు వేలం పాట అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ విగ్రహం ఎత్తుకు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటే బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం పాటలో పలికే ధరతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. బాలాపూర్ గణేశుడి లడ్డు అత్యంత శుభప్రదమైందనే ప్రచారం సాగడంతో దాన్ని వేలంపాటలో పాడుకోవడానికి ఏ యేటికాయేడు పోటీ పెరుగుతూ వస్తోంది.
గణేశుడి లడ్డును వేలంపాటలో దక్కించుకునే వ్యక్తి దాన్ని పంట పొలాల్లో చల్లుతారని అంటారు. ఊరిలోని పొలాల్లో చల్లడం వల్ల గ్రామానికి కూడా శుభం కలుగుతోందని నమ్ముతారు. తన నాన్న చివరి కోరిక మేరకే లడ్డును వేలం పాటలో దక్కించుకున్నట్లు పన్నాల గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications