లగడపాటి దిష్టిబొమ్మ దగ్ధం: ఒయులో మళ్లీ టెన్షన్

తెలంగాణ మార్చ్ సందర్భంగా జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా ఓయూ జేఏసీ ఇవాళ బంద్ కు పిలుపునిచ్చింది. కాగా, ఒక గుంపుగా విద్యార్ధులు ఎన్‌సీసీ గేటువైపు రావడంతో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓయూకు వెళ్లే దారులన్నింటిని మూసివేశారు. బంద్ ఉన్నందున ముందస్తు చర్యల్లో బాగంగా క్యాంపస్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.
ఉస్మానియా యునివర్సిటీని మూసివేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఆయన దిష్టిబొమ్మను వర్సిటీ విద్యార్థులు దహనం చేశారు. లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వర్సిటీకి వస్తే ఎవరుంటారో తేల్చుకుందామని విద్యార్థులు సవాలు విసిరారు.
సోమవారం తెలంగాణలో విద్యా సంస్థలను మూసేశారు. తెలంగాణ కవాతు సందర్భంగా ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్స సంగతి తెలిసిందే. పోలీసులు విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం వంటి చర్యలకు దిగారు.












Click it and Unblock the Notifications