జగన్‌కు నాయకత్వ లక్షణాలు: మేకపాటి, బాబుపై ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిత్యం అసత్యాలు చెప్పే వ్యక్తి అని, అలాంటి బాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తన హయాంలో ఏ వర్గానికైనా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింలతో సహా అన్ని వర్గాల వారికి మేలు కేవలం వైయస్ హయాంలోనే జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తనయులు అయినంత మాత్రాన అందరికీ నాయకత్వ లక్షణాలు రావని, జగన్‌కు మాత్రం అవి పుష్కలంగా ఉన్నాయన్నారు. తమ పార్టీకి లభిస్తున్న ఆధరణ చూసి వివిధ పార్టీల నేతలు, మంత్రులు తమతో రావడానికి సిద్ధమవుతున్నారన్నారు. అయితే వారి స్థానాలు ఇప్పటికే భర్తీ అయ్యాయని, కాబట్టి వారు అవకాశం కోల్పోయినట్లే అన్నారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వైయస్ ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ముస్లింలు కాంగ్రెసునే నమ్ముకునే ఉన్నా ఆ పార్టీ వారికి చేసింది ఏమీ లేదన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు.