హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీకి బాబు నివాళి: యాత్రకోసం 'నారా' వారి హోమం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తాను పేదల కోసం పాటుపడతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ సాక్షిగా తెలిపారు. ఆయన ఈ రోజు నుండి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుండి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు తన ఇంటి నుండి సికింద్రాబాదులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వచ్చారు. ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సమయంలో ఆయనతో దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పాలనలో రాష్ట్రం అస్తవ్య్తంగా మారిందని విమర్శించారు. తాను పేదల సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పారు. అనంతరం అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. అక్కడి నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన బాబు బెంగళూరు చేరుకున్నారు. అటునుండి అనంతపురం వెళ్లనున్నారు.

కాగా చంద్రబాబు తన పాదయాత్రను సూగురు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రారంభిస్తారు. బాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ ఇప్పటికే హిందూపురానికి చేరుకున్నారు. యాత్రలో తొలి రోజు బాబుతో పాటు భువనేశ్వరి, లోకేష్ కుమార్, నందమూరి కుటుంబ సభ్యులు ఉంటారు. బాబు యాత్ర కోసం ఆయన సొంతూరైన నారావారిపల్లెలో కుటుంబ సభ్యులు హోమం నిర్వహిస్తున్నారు. బాబు అల్లుడు ఉదయ్ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ హోమం రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం వరకు కొనసాగింది.

గాంధీజీకి కిరణ్, గవర్నర్ నివాళులు

గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు బాపూ ఘాట్‌లోని మహాత్ముడి విగ్రహానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం వారు అక్కడ ఫోటో ప్రదర్శనను తిలకించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

English summary
Telugudesam Party cheif Nara Chandrababu Naidu family is doing homam at Naravaripalli of Chittoor district for babu yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X