హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిల్లీరావుకు మళ్లీ నోటీసులు: బాబుకు తలనొప్పితప్పదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం బిల్లీ రావు(అహోబిల రావు)కు ఐఎంజి కేసులో నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ విలాస్ వి. అఫ్జుల్‌పుర్కార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఐఎంజి కేసును విచారించింది. న్యాయవాది టి.శ్రీరంగ రావు, ప్రముఖ జర్నలిస్ట్ ఎబికె ప్రసాద్‌లు ఐఎంజి భూమి కేసులో జరిగిన అక్రమాలను విచారించాలంటూ కోర్టును ఆశ్రయించారు.

దీంతో కోర్టు విచారణ చేపట్టింది. సోమవారం విచారణ ప్రారంభం కాగానే బిల్లీ రావు తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ మాట్లాడుతూ తమకు ఇంత వరకు హైకోర్టు పంపించిన నోటీసులు అందలేదని చెప్పారు. తమకు రెండు వారాల సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అందుకు కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. మిగతా వారు ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశారని తెలిపింది.

అందుకు వేదుల వెంకటరమణ మాట్లాడుతూ.. తమకు నోటీసులు అందలేదని చెప్పారు. అందుకే కౌంటర్‌కు సమయం కోరుతున్నాని వివరించారు. బిల్లీ రావు విజ్ఞప్తి మేరకు కోర్టు వారికి కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయగానే దాని కాపీని పిటిషనర్లకు అందచేయాలని వెంకటరమణకు ధర్మాసనం సూచించింది. కౌంటర్ అందుకోగానే దానికి తిరుగు సమాధానం కూడా ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది.

ప్రక్రియ మొత్తం రెండు వారాల్లో పూర్తి కావాలని ధర్మాసనం ఇరు పక్షాలకు సూచించింది. కాగా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఐఎంజి భూముల వ్యవహారంలో సిబిఐ దర్యాఫ్తు చేయాలని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సిబిఐ దర్యాఫ్తు జరిపి విషయమై హైకోర్టు ఆదేశాలిచ్చే సమయంలో బిల్లీ రావు తనకు నోటీసులు రాలేదని చెప్పి సమయం కోరారు. కాగా ఈ భూముల వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరగడంతో ఆయనకు చిక్కులు తప్పవని అంటున్నారు.

English summary
The AP High Court on Monday issued a notice to P. Ahobala Rao, alias Billy Rao, of IMG Academics Bharata, on two PILs, seeking a CBI probe into a land deal between the state government and IMG Bharata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X