హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ వర్సెస్ వివేక్: సిఎం ఉంటే రానని ఎంపీ ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Vivek
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ ఝలక్ ఇచ్చారు. మంగళవారం అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవనంలో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడకు ముఖ్యమంత్రి కిరణ్‌తో పాటు పిసిసి చీఫ్, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివేక్ తదితరులు వచ్చారు.

వివేక్‌ను చూసిన బొత్స... వచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరారు. అందుకు వివేక్ ఘాటుగా స్పందించారు. తాను ముఖ్యమంత్రి ఉండగా రానని, ఆయన వెళ్లిన తర్వాత నివాళులు అర్పిస్తానని చెప్పారు. అన్నట్లుగానే కిరణ్ గాంధీజీకి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత వివేక్ వెళ్లారు. ఇది కాంగ్రెసు పార్టీలో చర్చకు దారి తీసింది.

తెలంగాణ కవాతు సమయంలో తమపై కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు, కవాతుపై ఉక్కుపాదం మోపడం, కవాతుకు అనుమతించి అరెస్టులు చేయడం తదితర అంశాలపై కిరణ్ పైన వివేక్‌తో పాటు టికాంగ్రెసు ఎంపీలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే కిరణ్ ఉండగా తాను రానని చెప్పారు.

అయితే కిరణ్ వ్యవహార శైలిపై రేణుకా చౌదరి న్యూఢిల్లీలో మండిపడ్డారు. తెలంగాణ వస్తున్న సమయంలో సొంతపార్టీ ఎంపీలు ప్రకటన వెనక్కి వెళ్లేలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధిష్టానం పైన విశ్వాసం లేనివాళ్లే కిరణ్ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎంపీలు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.

మహాత్ముడికి డిప్యూటీ స్పీకర్ నివాళులు

కాగా డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాపూజీ అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని పారదోలి దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చారన్నారు. మహాత్ముడి బాటలో అందరూ నడవాలన్నారు. ఆయన దారి ఆచరణీయం, ఆదర్శమన్నారు.

English summary
Peddapalli of Karimnagar district MP G.Vivek gave shock to CM Kiran Kumar Reddy on Tuesday. Vivek tributed to Mahatma Gandhi after leaving Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X