mekapati rajamohan reddy ys vijayamma chandrababu naidu telangana hyderabad మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్ విజయమ్మ చంద్రబాబు నాయుడు తెలంగాణ హైదరాబాద్
ఏం చేయలేం: తెలంగాణపై మేకపాటి, బాబు సాహసం!

కేంద్రం తేల్చాల్సిన అంశం అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరవయ్యేళ్ల వయస్సులో వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర తలపెట్టి పెద్ద సాహసమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసమే బాబు అరవయ్యేళ్ల పైబడి వయస్సులో ఈ సాహసం చేస్తున్నారన్నారు. సినిమా వారి దర్శకత్వంలో బాబు యాత్ర చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరి మంచి పనులు చేసి ఉంటే ప్రజలు దేవుడిలా కొలిచే వారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు బాబు అవస్థలు పడుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసం కోల్పోయాక ఎన్ని పాదయాత్రలు చేసినా బస్సు యాత్రలు చేసినా లాభం ఉండదన్నారు.
తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొందరు తాము మహాత్మా గాంధీ వారసులమని చెప్పుకుంటూ ఆయన ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి విమర్శించారు.
విజయమ్మ నివాళులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పులివెందులలో జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె రెండు రోజులు పులివెందులలో ఉండి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.