అందరి ముందే నిర్మాతను హత్య చేసిన ముఠా

దుండగులు 35 ఏళ్ల పిపిజి కుమరన్‌పై శ్రీపెరుంబుదూర్ పట్టణ పంచాయతీ కార్యాలయం ముందు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమరన్ ఇటీవల విడుదలైన తమిళ చిత్రం వైగేయి నిర్మించాడు. పిల్లైపక్కం పట్టణ పంచాయతీ నుంచి ఆయన స్వతంత్రంగా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించాడు.
కుమరన్ కార్యాలయానికి వెళ్తుండగా ఓ ముఠా కారుకు అడ్డం పడ్డారని, దాంతో డ్రైవర్ కారును ఆపాల్సి వచ్చిందని, హతులు కారుపైకి కనీసం మూడు బాంబులు విసిరారని, కారు తలుపులు బలవంతంగా తీసి కుమరన్‌పై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారని దర్యాప్తు అధికారులు చెప్పారు. కుమరన్‌కు భద్రత కల్పిస్తున్న ఆయన బంధువు మథి అలియాస్ మథైలగన్‌పై కూడా దుండగులు దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన కుమరన్, శంకర్, మథైలగన్‌లను పోలీసులు తొలుత శ్రీపెరంబుదూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి చేర్చారు. అయితే, మార్గమధ్యంలోనే కుమరన్ మరణించారు. మథైలగన్, శంకర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కుమరన్ హత్యకు కారణం రాజకీయ వైరమా, వ్యాపార వైరుధ్యాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications