మారకపోతే లగడపాటికి దేహశుద్ధి తప్పదు: కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తీవ్రంగా మండిపడ్డారు. లగడపాటిపై ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదు లేని తెలంగాణకు కెసిఆర్ ప్రతిపాదన చేశారని చెప్పి తన వెకిలితనాన్ని లగడపాటి బయట పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటికి మతి మాత్రమే భ్రమించిందని అనుకున్నారు గానీ కంటిచూపు కూడా మందగించిందని తెలంగాణ మార్చ్‌కు 30 వేల మంది మాత్రమే వచ్చారని చెప్పడం ద్వారా బయట పెట్టుకున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసు కెసిఆర్‌ను చర్చలకు ఆహ్వానించలేదని లగడపాటి అనడాన్ని ఆయన తిప్పికొట్టారు. తెలంగాణపై సోనియా గాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెసు అధిష్టానం పెద్దలు కెసిఆర్‌తో చర్చలు జరుపుతున్నారని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. దానికి లగడపాటి ఏం సమాధానం చెప్తారని ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందని తెలిసి కాలు గాలిన పిల్లిలా లగడపాటి వ్యవహరిస్తున్నారని, కెసిఆర్‌పై దుష్ర్పచారం చేశారని ఆయన అన్నారు. తీరు మారకపోతే లగడపాటికి తెలంగాణవాదుల చేతుల్లో దేహశుద్ధి తప్పదని కెటిఆర్ హెచ్చరించారు.

హైదరాబాదుతో కూడిన తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, హైదరాబాదు లేని తెలంగాణను ఎవరూ అంగీకరించబోరని ఆయన అన్నారు. రాజకీయ అనివార్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని భావిస్తున్నామని, తెలంగాణపై కెసిఆర్ తుది దశ చర్చలు కేంద్ర ప్రభుత్వం పెద్దలతో జరుగుతాయని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు జరుపుతూనే తెలంగాణ కోసం చర్చలు జరుపుతామని చెప్పారు. హైదరాబాదు లేని తెలంగాణ తమకు ఆమోదయోగ్యం కాదని తాము కేంద్రం పెద్దలతో స్పష్టం చేసినట్లు కెటిఆర్ తెలిపారు.

తెలంగాణ కోసం రాజకీయ, ఉద్యమ కార్యాచరణలు రెండూ ఉంటాయని, లగడపాటివన్నీ పనికి మాలిన మాటలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం చర్చలు అవసరమే కాబట్టి చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణతో లగడపాటికి సంబంధం ఏమిటని ఆయన అడిగారు. ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని అంటున్న లగడపాటి రాజీనామా చేసి తెలంగాణలో పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్టానికి కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. లగడపాటి ఉన్మాదిలా, పిచ్చిపట్టినవాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైయస్ జగన్‌పై వేటు వేస్తే కాంగ్రెసు నిలువునా చీలుతుందని ఆనాడు లగడపాటి వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ ఆమరణ దీక్ష ద్వారా కేంద్రం తెలంగాణను ప్రకటించిన తర్వాత లగడపాటి ఎలా పిచ్చిపట్టినవాడిలా వ్య.వహరించారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+