తెలంగాణ: జడ్జికి శంకర రావు లేఖ, బాధించింది.. గండ్ర

కవాతు శాంతియుతంగా జరుగుతున్న సమయంలో డిజిపి లాఠీఛార్జా చేయాల్సిందిగా ఆదేశించారని ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసులు విద్యార్థులపై జులుం చూపించారన్నారు. విద్యార్థులపై, తెలంగాణవాదులపై విరుచుకుపడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన సిజెను కోరారు. కాగా కవాతును విజయవంతం చేసినందుకు ఆయన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధించాయి... గండ్ర
రాజకీయాల కోసం రాష్ట్ర విభజన జరగదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తప్పు పట్టారు. కిరణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధకు గురి చేశాయన్నారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత ఎంపీల తీరు పార్టీని బలహీనపరుస్తోందన్నారు. తెలంగాణ మంత్రులను జెఏసి టార్గెట్ చేసుకోవడం సరికాదన్నారు. తమను ఎవరూ వెలివేయాల్సిన అవసరం లేదన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయన పథకాలన్ని కోటి వరాలు కోటి దగాలు అని ఎద్దేవా చేశారు. బాబు తీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉందన్నారు. బాబు కొంగ జపాన్ని ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. అల్లుళ్ల వెన్నుపోటు నుండి తప్పించుకునేందుకే బాబు యాత్ర చేపట్టారని, 2014లో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.












Click it and Unblock the Notifications