lagadapati rajagopal tg venkatesh telangana sushil kumar shinde vayalar ravi new delhi లగడపాటి రాజగోపాల్ టిజి వెంకటేష్ తెలంగాణ సుశీల్ కుమార్ షిండే వాయలార్ రవి న్యూఢిల్లీ
తెలంగాణ కవాతు: షిండేకు లగడపాటి 16పేజీల నివేదిక

కవాతను ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని, కానీ ఆ తర్వాత మాట తప్పిందని ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను, మీడియా వాహనాలు మాత్రమే కాకుండా రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. కవాతులో వామపక్ష తీవ్రవాదులు పాల్గొనడం వల్లనే విధ్వంసం జరిగిందని ఆయన షిండి దృష్టికి తీసుకు వెళ్లారు. తెలంగాణ ప్రకటిస్తే రాష్ట్రం గందరగోళంగా మారుతుందని, కాబట్టి యథావిథిగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
సీమ కోసం ప్రత్యేక ప్యాకేజీ కోరాం... టిజి వెంకటేష్
రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం తాము కేంద్రాన్ని లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించమని కోరామని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ వేరుగా అన్నారు. టిజి వెంకటేష్ రాయలసీమ పరిరక్షణ వేదికకు సంబంధించిన పలువురితో కలిసి కేంద్రమంత్రి వాయలార్ రవిని కలిశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాల సహకారం లేక లబ్ధి పొందలేక పోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ మాత్రమే అన్నారు. అన్ని వనరులు ఉన్నా అనుభవించలేక పోవడం తమ దురదృష్టమన్నారు.