బాబుపై బొత్స జాలి: వైయస్ జగన్ పార్టీ చేతగానితనం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రతి దానిని కుట్ర పేరుతో ఆరోపణలు చేయడం జగన్ పార్టీకి అలవాటైందన్నారు. కోర్టులో జగన్ తరఫు న్యాయవాదుల ప్రశ్నలకు జవాబులు ఎవరు చెప్పాలన్నారు. సుప్రీం కోర్టు అన్ని పరిశీలించిన మీదటనే జగన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని చెప్పారు.
టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని వైయస్ విజయమ్మ చెప్పడం ఆ పార్టీ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రూ.10 షేరును రూ.350కి ఎలా అమ్మారన్న జడ్జి వ్యాఖ్యలపై జగన్ పార్టీ మొదట సమాధానం చెప్పాలన్నారు. జైలుకు పంపించాల్సిన అవసరమైతే కాంగ్రెసుకు లేదన్నారు. అంతా చట్టపరిధిలోనే జరుగుతోందన్నారు. జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ విషయమై మాట్లాడుతూ.. ఈడి కూడా తన పని తాను చేసుకుపోతోందన్నారు.
తమ పార్టీలో అభిప్రాయ బేధాలు ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఓ పార్టీలో అభిప్రాయ బేధాలు ఉండటం సహజమేనని, అయితే వాటిని బయటకు చెప్పడం, మీడియాకు ఎక్కడం మాత్రం సరికాదని ఆయన చెప్పారు. అసంతృప్తి ఉన్న వారు పార్టీ సమావేశాలలో చెప్పాలన్నారు. లేఖలు, ఆరోపణలే కాంగ్రెసు పార్టీకి బలం అన్నారు. వీటి వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం లేదన్నారు. అధిష్టానానికి లేఖలు రాయటంలో ఎలాంటి తప్పు లేదన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్నారు. ముఖ్యమంత్రికి, తనకు మధ్య గాని, సిఎంకు, మంత్రులకు మధ్య గాని ఎలాంటి విభేదాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications