వైయస్ విజయమ్మ యాత్ర: భారతి, షర్మిళ కూడా..

YS Vijayamma
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో, మరో ఆరు నెలల పాటు ఆ అవకాశం లేకపోవడంతో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమావేశమై చర్చించారు. ఈ స్థితిలో వైయస్ విజయమ్మ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె కోడలు భారతి, వైవి సుబ్బారెడ్డి శనివారం చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌ను సందర్శించారు.

వైయస్ విజయమ్మ ఓదార్పు యాత్రను కొనసాగించాలా, పాదయాత్ర చేపట్టాలా అనే విషయంపై పార్టీలోనూ కుటుంబంలో చర్చ సాగుతోంది. అయితే, ఏదో ఒక యాత్ర మాత్రం చేపట్టేలా కార్యాచరణ రూపొందించడానికి చర్చలు జరుపుతున్నారు. వైయస్ జగన్ అరెస్టుతో ఓదార్పు యాత్ర ఆగిపోయింది. అయితే, బెయిల్ వస్తుందని, అది రాగానే జగన్ తిరిగి ఓదార్పు యాత్ర చేస్తారని భావించారు. కానీ ఇప్పట్లో అది జరిగే పరిస్థితి లేదు.

విజయమ్మ ఎలా ఉండాలనే విషయంపై పార్టీ నాయకులు మరోసారి సాయంత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాగా, విజయమ్మతో పాటు జగన్ భార్య భారతి, సోదరి షర్మిళ కూడా యాత్రలో పాల్గొనే విధంగా కార్యాచరణను రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. జగన్‌కు బెయిల్ రాకపోవడం వల్ల పార్టీ దెబ్బ తింటుందనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వైయస్ విజయమ్మ యాత్ర చేపట్టడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైయస్ జగన్ జైలులో ఉన్నా పార్టీ చెక్కుచెదరకుండా ముందుకు సాగుతుందని చెప్పడానికి కార్యాచరణ అవసరమని భావిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా ప్రతినిధులతో అ్నారు. పార్టీని మరింత కసిగా నడిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. సాయంత్రానికి కార్యాచరణపై ఓ స్పష్టత వస్తుందని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్న విషయాన్ని, కాంగ్రెసుతో కుమ్మక్కయి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్‌కు బెయిల్ రాకుండా చేసిన కుట్రను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి కార్యాచరణ తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+