డబ్బివ్వాలని జగన్‌పై ఇన్వెస్టర్ల ఒత్తిడి, ఇంటిపై నిఘా?

మరోవైపు జగన్ ఇంటికి వచ్చి వెళుతున్న వారిపై సిబిఐతో పాటు ఇంటెలిజన్స్ వర్గాలు నిఘా పెట్టాయట. ఎవరెవరు వస్తున్నారని గమనిస్తున్నారట. జగన్ జైలు నుండి బయటకు వస్తే పరిస్థితులు కొంచె కుదుట పడతాయని ఆయన కుటుంబ సబ్యులు, పార్టీ నేతలతో పాటు ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా భావించారు. అయితే ఇప్పట్లో జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో వారిలో ఆందోళన ప్రారంభమైందంటున్నారు.
కాగా వైయస్ జగన్ నివాసంలోనూ కార్యాలయాల్లోనూ సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి తీసుకుని వారు ఈ సోదాలు చేశారు. తదుపరి విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు.
ఎస్పీ వెంకటేష్ నేతృత్వంలో సిబిఐ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్, జననీ ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బినామీ కంపెనీలకు చెందిన పత్రాలు సిబిఐ చేతికి చిక్కినట్లు చెబుతున్నారు.
సిబిఐ అధికారులు ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారికంగా సమాచారం అందుతున్నప్పటికీ 12 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జగన్ బినామీ కంపెనీల్లోనూ, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లోనూ సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును ముగించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, సూట్‌కేసు కంపెనీలపై మరింత సమాచారం సేకరించామని సిబిఐ అధికారులు అంటున్నారు.
వైయస్ జగన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. దర్యాప్తు ముగిసే వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవద్దని కూడా సుప్రీంకోర్టు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదేశించింది. దర్యాప్తు ముగించడానికి సుప్రీంకోర్టు సిబిఐకి గడువు కూడా పెట్టింది. దీంతో గడువులోగా దర్యాప్తు ముగించేందుకు సిబిఐ వేగంగా కదులుతోంది.












Click it and Unblock the Notifications