ఇప్పుడు ఏం చేద్దాం?: జైల్లో జగన్‌తో విజయమ్మ భేటీ

జగన్‌కు ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చే సూచనలు కనిపించకపోతుండటంతో విజయమ్మ, షర్మిలతో ఓదార్పు యాత్రను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ పార్టీ నేతల సమావేశంలో వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ శ్రేణుల్లో ధైర్యం సడలకుండా ఉండటానికి వారి ఓదార్పుయాత్ర అవసరమని భావించినట్లు తెలుస్తోంది. సోమవారం విజయమ్మ అధ్యక్షతన పార్టీ సిజిసి, సిఈసి సమావేశాలను నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణను ఖరారుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
కాగా విజయమ్మ, భారతి, వైవి సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి శనివారం మధ్యాహ్నం చంచల్‌గూడ జైలుకు వెళ్లి జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగన్‌కు బెయిల్ నిరాకరణ దరిమిలా పార్టీ వ్యవహారాల నిర్వహణ, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. జగన్‌తో విజయమ్మ పార్టీ భవిష్యత్తుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications